Monday, November 11, 2024

Vemulawada – రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు

  • అవినీతి అక్రమాలపై ఫిర్యాదులతో ఆకస్మిక తనిఖీలు
  • సరుకుల శాంపిళ్ల సేకరించిన అధికారులు
  • వివ రాలు వెల్లడించిన ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి

వేములవాడ, ఆగస్టు 22 (ప్రభన్యూస్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు చెపట్టారు. దేవస్థానంలోని ప్రధాన విభాగాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో గురువారం ఏసీబీ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఏసీబీ కరీంనగర్‌ రేంజ్‌ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో గోదాము విభాగంలోని సరుకుల శాంపిళ్లను సేకరించారు.

అలాగే ప్రసాదాల తయారీలోనూ వినియోగిస్తున్న సరుకుల శాంపిళ్లను తీసుకున్నారు. అలాగే తూనికలు, కొలతలు, ఆహార భద్రత, ఆడిట్‌ శాఖలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ రాజన్న ఆలయంలోని పలు విభాగాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుల వెరకు దాడులు జరిపామని తెలిపారు. తూనికలు కొలతలు, ఫుడ్‌ సేప్టీ, ఆడిట్‌ అధికారులతో కలిసి విచారణ చేపడుతున్నామని వివరించారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు- స్పష్టం చేశారు. దాడుల్లో సిఐలు కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement