బాసర, డిసెంబర్ 24 (ఆంధ్రప్రభ) : బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్యధనంజయ్ మంగళవారం దర్శించుకొని, పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆచార్య సూర్యాధనంజయ్ ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అమ్మవారి సన్నిధిలో వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ చే ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి, హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆశీర్వచనం మండపంలో వైస్ ఛాన్స్ లర్ సూర్య ధనంజయ్ ను శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుత హైకోర్టు న్యాయవాది డా.ధనంజయ్ నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్ ఇంస్ట్రక్టర్ డా.రవితేజ, మంత్రి శ్రీనివాస్, తదితరులున్నారు.