- రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
- కొనసాగుతున్న దర్యాప్తు
ఆంధ్రప్రభ స్మార్ట్, వర్ని (నిజామాబాద్) : ఏసీబీ వలలో వర్ని ఎస్సై కృష్ణ కుమార్ చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా…
నిజామాబాద్ జిల్లా వర్నిలో వివాదం జరిగింది. అందులో ఓ వ్యక్తి తన పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయవద్దని ఎస్ఐని కోరాడు. దీంతో రూ.50వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పాడు. రూ.20 వేలు లంచంగా ఇస్తానని చెప్పిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లంచం ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు.