Friday, November 22, 2024

Vardhannapet – హరిత ప్రదాత సీఎం కేసీఆర్….ఎమ్మెల్యే అరూరి…

వర్ధన్నపేట – తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వర్దన్నపేట మండలం కట్ర్యాల లో నిర్వహించిన హరితోత్సవంలో ఎమ్మెల్యే అరూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాదు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు. వాతావరణ సమతుల్యత ఉండాలంటే 33శాతం అడవులు ఉండటం ఒక్కటే మార్గమని నమ్మిన కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, ప్రజలు, పార్టీ ప్రతినిధులు ప్రతీ ఒక్కరి భాగస్వామ్యంతో నేడు తెలంగాణ పచ్చదనంతో ఫరడవిల్లుతోందని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలలో నర్సరీలు ఏర్పాటు చేసి ఒక ప్రణాళికతో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటుతో పాటు అనువైన చోటల్లా విరివిగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. దీంతో తాజాగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం తోడవడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement