Friday, November 22, 2024

MBNR | వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ సస్పెండ్

ఫలించిన రాచాల యుగంధర్ గౌడ్ పోరాటం
జిల్లా ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు
వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 30(ఆంధ్ర ప్రభ): వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే…. వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభు వినయ్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా, హాజరు రిజిస్టర్, ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవడంతో పాటు సీనియారిటీ లిస్టులో అక్రమాలకు పాల్పడ్డారని బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్.రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటర్ కు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

దీంతో ప్రభు వినయ్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతన్ని బుధ‌వారం సస్పెండ్ చేశారు. తన ఫిర్యాదుపై స్పందించి ప్రభు వినయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి ఈ సందర్బంగా రాచాల కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుండి వేతనం, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు(డీఏ), వాహనం పొందుతున్న అధికారులు ప్రజలను ఇబ్బందులు పెట్టడం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం, న్యాయ వ్యవస్థలకు తప్పుడు నివేదికలు ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తామని రాచాల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement