Tuesday, November 26, 2024

వరదలో కొట్టుకుపోయిన చెక్ డ్యాంను పరిశీలించిన వనమా.. నిర్లక్ష్య అధికారులపై చర్యలకు ఎమ్మెల్యే ఆదేశం

పాల్వంచ మండలంలోని నాగారం దగ్గర కిన్నెరసాని వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈరోజు ఎమ్మెల్యే వనమా కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దీనికి బాధ్యులైన సంబంధిత కాంట్రాక్టర్ పై చెక్ డ్యామ్ నిర్మాణంలో సరిగా పర్యవేక్షణ చేయనటువంటి ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వనమా అధికారులు ఆదేశించారు. చెక్ డ్యామ్ కింద నాట్లు వేసిన సుమారు 150ఎకరాల వరిపొలం కొట్టుకుపోయి ఇసుక మ్యాటేయడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు.

కొట్టుకుపోయిన వారికి వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని, ఈ విషయం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి ఎంక్వైరీ కమిటీ కూడా వేయిస్తానన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, వదిలి పెట్టేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో Dcms వైస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఎంపీపీ సరస్వతి, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ రాజుగౌడ్, మండల ప్రెసిడెంట్ శ్రీరాముర్తి, సర్పంచ్ హరి, ఎంపీటీసీలు, BRS నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement