ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు కోసం బీఆర్ఎస్ నేతలు విన్నూత్న ప్రచారం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సొంత గ్రామమైన అన్నాసాగర్‌లో పార్టీ అభిమాని రాగనమోని శ్రీశైలం ఏకంగా తన కొడుకు పెండ్లి ప్రతికల్లో ‘ఓట్ ఫర్ కార్’ అంటూ ముద్రించాడు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దంపతుల ఫొటో కూడా ప్రచురించి అందరి దృష్టిని ఆకర్శించాడు. శుభలేఖ అందుకున్న వారంతా కవర్ పేజీని చూసి ఇలా కూడా అభిమానం చాటుకోవచ్చా అని ఆశ్చర్యపోయారు.