కామారెడ్డి, (ప్రభన్యూస్) : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భం గా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో అవసరం అయితే ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. పీ.హెచ్.సీ.లో ఇక నుండి ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఖచ్చితంగా విధులు నిర్వహించాలని, లేనిచో చర్యలు తీసుకోవాలని కలెక్టరులను ఆదేశించారు, అలాగే ఇకనుండి గ్రామాల లోని ఆశల దగ్గరనుండి వైద్య అధికారుల వరకు అన్ని కార్యక్రమాలపై కలెక్టర్ మరియు డీ.హెమ్.హెచ్.ఓ. ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
వైద్యాధికారులు, డిప్యూటీ డీ.హెమ్.హెచ్.ఓ.లు , పీ.ఓ. లు, డీ.హెమ్.హెచ్.ఓ.లు అందరు వారివారి ప్రాంతంలో గల పి హెచ్.సిలను సందర్శించి ఎప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలను ముందు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి డోసు 79% రెండో డోస్ లో 28 శాతం మాత్రమే కవరేజ్ అయిందని, వందకు వందశాతం దిశగా ఆశా నుండి మొదలుకొని అధికారుల వరకు నిబద్ధతతో పని చేసి ప్రజలకు వాక్సిన్ ఇచ్చి కరోనా రాకుండా చూడాలని, అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంను కరానా రహిత ప్రాంతంగా మార్చాలని కోరారు. ఇక నుండి తాను కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాను సందర్శించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ ఆస్పత్రులను, ఏరియా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ లను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily