Friday, November 22, 2024

తెలంగాణలో 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్

కరోనా కట్టడికి తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ నెలలో 30 ల‌క్ష‌ల మందికి పైగా రెండో డోస్ వ్యాక్సినేష‌న్ ఇవాల్సి ఉంద‌ని ఆరోగ్య‌శాఖ సంచాల‌కుడు శ్రీ‌నివాస రావు తెలిపారు. గురువారం నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఆన్‌ లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారికి 204 ప్ర‌భుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే 636 పీహెచ్‌సీల్లో వాక్‌-ఇన్ రిజిస్ట్రేష‌న్‌లో ప‌ద్ద‌తిలో వ్యాక్సినేష‌న్ అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ నెల 3 నుంచి జీహెచ్ఎంసీలో 100 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ పంపిణీని చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్లడించారు. కొవిషీల్డ్ రెండో డోసు 14 నుంచి 16 వారాల మ‌ధ్య‌లో అదే కొవాగ్జిన్ రెండో డోసు 4 నుంచి 6 వారాల మ‌ధ్య‌లో తీసుకోవచ్చ‌ని శ్రీనివాస రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement