కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మని వాస్తవాలని చెప్పారన్న వీహెచ్.. గవర్నర్ అనే వ్యక్తి రబ్బర్ స్టాంప్ కాకూడదన్నారు. రాష్ట్రలలో అన్యాయం జరిగితే గవర్నలు స్పందించాలన్నారు. రైతుల అంటే ప్రధాని మోదీకి లెక్కలేదని అన్నారు. ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయలని చుస్తున్నారని ఆరోపించారు.
కరోనా కారణం ప్రపంచంలో ధనవంతుల ఆర్ధికంగా నష్టపోతే..అదానీ, అంబానీల ఆస్తులు 400 రేట్లు పెరిగాయని చెప్పారు. రైతులని పట్టించుకోని మోడి బడుగు బలహీన ప్రజలని ఎం పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. జెపి నడ్డా మాటలు చెప్పడం తప్పా..చేతలు ఉండవని విమర్శించారు. కెసిఆర్ అవినీతిపై అని అధరాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీహెచ్ ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital