దళితులకు ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైందని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళ లాక్ అప్ డెత్ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత కాంగ్రెస్ నేతలు చెబితే సీఎం స్పందించారని మండిపడ్డారు. దళిత ఎం పవర్ మెంట్ కాదు.. గతంలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో, సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే దిక్కు లేదని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. 12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని ఉత్తమ్ తెలిపారు.
దళితులకు ముఖ్యమంత్రి స్లోగన్ ఏమైంది?: ఉత్తమ్
By mahesh kumar
- Tags
- cm kcr
- dalit empowerment
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Telanagana News
- TELANGANA CONGRESS
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TPCC
- trs government
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement