Monday, November 25, 2024

తగ్గిన పవర్‌ వాడకం! వరిసాగు విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణం..

రాష్ట్రంలో వరి విస్తీర్ణం తగ్గడంతో.. విద్యుత్‌ డిమాండ్ కూడా భారీగానే తగ్గింది. వారం పది రోజులుగా 10 వేల మెగావాట్ల లోపే విద్యుత్‌ ఉంటోంది. ఉదయం మాత్రమే కాస్త డిమాండ్‌ ఎక్కువగా ఉండగా.. మధ్యాహ్నాం, సాయంత్రం ఆరేడువేల మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే వినియోగం అవుతోంది. మూడు రోజుల క్రితం కేవలం సాయంత్రం అత్యంత తక్కువగా 4,930 మెగావాట్లే నమోదైంది. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది యాసంగిలో దాదాపుగా 68 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా.. ఈ ఏడాది అందులో సగం విస్తీర్ణం కూడా సాగయ్యే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం కూడా చాల వరకు తగ్గింది. అయితే గత సంవత్సరం యాసంగి సాగు విస్తీర్ణం పెరిగినా.. కరోనా కా రణంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూతపడటంతో కరెంట్‌ వాడకం తక్కువగానే నమోదైంది. ఇప్పుడు లాంటి పరిస్థితి లేదు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్ని పూర్తిగా వినియోగంలోనే ఉన్నాయి. కానీ, వరి సాగు తగ్గడంతో పాటు ఇటీవల అకాల వర్షాలతో వాతావరణం చల్లబడటంతో కూడా కరెంట్‌ వినియోగం తగ్గింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో బోరు బావుల కింద వరి సాగు అత్యధికంగా సాగువుతుంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 25.78 లక్షల వరకు ఉన్నాయి. విద్యుత్‌ సరఫరాలో 30 శాతానికి పైగా వ్యవసాయ మోటార్లకే వినియోగం ఉంటుంది. గతేడాది ఇదే యాసంగిలో వరితో ఇతర పంటల సాగు దాదాపుగా 68.14 లక్షల ఎకరాల వరకు ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. యాసంగి వరి ధాన్యం కొను గులోపై కేంద్రం ఆంక్షలు పెట్టడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి వేయవద్దని రైతులకు విజ్ఞఫ్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు కూడా వరి సాగును తగ్గించి, ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో వరి సాగుకు విద్యుత్‌ వినియోగం కూడా తగ్గిందని సంబంధిత శాఖ అధి కారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా చూస్తుంటే.. ఏ ఒక్క రోజు కూడా విద్యుత్‌ డిమాండ్‌ 10 వేల మెగావాట్లకు దాటలేదు. గత ఏడాది ఇదే నెలలోని మూడో వారంలో 13,452 మెగావాట్ల విద్యుత్‌ వినియాగం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఇప్పుడు విద్యుత్‌ డిమాండ్‌ దాదాపుగా 3 వేల మోగావాట్లు తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement