Friday, November 22, 2024

జీహెచ్‌ఎంసీలో డ్రోన్ల వినియోగం..


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు చెరువులు, కుంటలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాలు దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా ఉంటున్నాయి. పలు చెరువుల్లో గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించే అవకాశం లేకపోవడం, దోమల నివారణకు పలు ప్రాంతాల్లో రసాయనాలను పూర్తి స్థాయిలో పిచికారి చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉండటంతో దోమలను పూర్తిస్థాయిలో నియంత్రించడం అసాధ్యంగా మారింది.

వీటి పూర్తిస్థాయి నియంత్రనకు సాంకేతిక పరిజ్ఞానంతో సమాధానం చెప్పటానకి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దీంతో నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల లార్వా నిర్వీర్యం చేసేందుకు జీహెచ్‌ఎంసీ డ్రోన్లను వినియోగిస్తుంది. దోమల సమస్య అధికంగా ఉన్న చెరువులు, కుంటలు, కాలనీలు, క్వారీలు, ఓపెన్‌ ప్లాట్లు, డంపింగ్‌ యార్డులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా నగరంలో 30 చెరువుల్లో డ్రోన్ల సహాయం దోమలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement