Thursday, November 21, 2024

ఘనంగా ఉర్దూ జర్నలిజం ఉత్సవాలు.. హోంమంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉర్దూ జర్నలిజం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఉర్దూ భాష జర్నలిజం సుదీర్ఘ చరిత్ర కలిగివుందన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో ఉర్దూ జర్నలిజం వేడుకల నిర్వహణపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ్స ఫెడరేషన్‌ సభ్యులతో సమీక్షను మంత్రి మహమూద్‌ అలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళను పూర్తి చేసుకోవడం శుభపరిణామని అన్నారు.

సీఎం కేసీఆర్‌కు ఉర్దూ భాషపై మంచి పట్టు ఉందన్నారు. ఉర్దు జర్నలిజం వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తునున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను రవీంద్రభారతి వేదికగా నిర్వహిస్తామని, అందుకు సంంధించి పర్యాటక శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇంటర్మీడియేట్‌ బోర్డు కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌, టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement