హైదరాబాద్, ప్రభన్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వచ్చే ఏడాది మార్చి నాటికి అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ, నగర ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో కొంత భాగాన్ని మాత్రమే కనీస సౌకర్యాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దుతున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా పార్కుల అభివృద్ధికి, ప్లాంటేషన్‌లో భాగం అయ్యేందుకు ముందుకు వచ్చే కార్పోరేట్ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు.
ప్రభుత్వం నిర్దేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పా టు చేసి , ప్రజలకు వచ్చే మార్చి నాటికల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్‌ఎండిఎ పరిధిలో 59 పార్కులు ఉండగా, వివిధ జిల్లాల్లో 50 పార్కులు ఉన్నాయి. వీటిలో 53 పార్కులు ఇప్పటికే పూర్తికాగా, మిగిలిన 52 పార్కులు వివిధ దశల్లో ఉన్నా యని, వాటిని మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు అధి కారులు తెలిపారు. ప్రతి పార్కులో పర్యవరణ హితంగా పచ్చదనం పెంచే రీతిలో చిక్కగా మొక్కలను నాటుతున్నారు. అటవీ చట్టాలకు లోబడి పార్కుల్లో అవస రాలను బట్టి సందర్శకులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily