హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే తొమ్మిది, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సుల తరగతులు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో అప్పర్ ప్రైమరీ తరగతులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. అయితే రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఆమె కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement