తెలంగాణ టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టకు చెందిన బెలిదే నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకొని ఆర్థిక ఇబ్బంది పడుతున్న విషయం టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలుసుకొని, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా… సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 55వేల విలువ గల చెక్కును ఈరోజు లబ్ధిదారుడు బెలిదే నవీన్ కుమార్ ( హైదరాబాద్ లోని మేడిపల్లి PNT కాలనీ) నివాసానికి వెళ్లి అందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital