Wednesday, January 15, 2025

UP – తీర్థ‌యాత్ర‌లో విషాదం – బ‌స్సు దగ్ధంతో భ‌క్తుడి మృతి.

విషాదం మిగిల్చిన తీర్థయాత్ర
భైంసా డివిజన్ యాత్రీకుల బస్సుకు అగ్ని ప్రమాదం
– యూ పీ బృందావన్ లో ఘటన.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి యాత్రీకుని సజీవ దహనం
– మిగతా యాత్రీకులంతా పూర్తిస్థాయిలో సురక్షితం
– బస్సు ,యాత్రీకుల సామాగ్రి పూర్తిగా దగ్ధం
– యూపీ పోలీసుశాఖ, ఆర్ ఎస్ ఎస్ సంరక్షణలో యాత్రీకులు
– వసతులు కల్పించిన అక్కడి ఆర్ఎన్ఎస్, వ్యాపార సంస్థలు

భైంసా ( ప్రభ న్యూస్ ): నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధి నుంచి ఈ నెల 1న తీర్ధయాత్రలకు బయలు దేరిన యాత్రీకుల బస్సు ఒకటి అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘ‌ట‌న‌ల‌లో ఒక భ‌క్తుడు స‌జీవ‌ద‌హ‌నం అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.

- Advertisement -

ఘటనలో బస్సుతో పాటు యాత్రీకులకు సంబందించిన సామాగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మధుర నుంచి బృందావన్ కు యాత్రీకుల బస్సు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకుంది. యాత్రకు బయలుదేరిన 50 మంది యాత్రీకులలో అందరూ బృందావన్ క్షేత్ర సందర్శనకు వెళ్లారు. పల్సి గ్రామానికి చెందిన వృద్దుడొకరు ఆనారోగ్య కారణాలతో బృందావన్ దర్శనానికి వెళ్లకుండా బస్సులోనే ఉండిపోయాడు. ఇదే సమయంలో బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులోనే ఉన్న వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు. మంటల తీవ్రతకు బస్సుతో పాటు ప్రయాణికుల వస్తువులు, సామాగ్రి, నగదు తో పాటు ఇతర వస్తువలన్నీ పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. దీంతో యాత్రీకుల కట్టు బట్టలు మాత్రమే మిగిలాయి. బస్సుకు అంటిన మంటలను అక్కడి ఫైర్ సిబ్బంది ఆర్పివేసే చర్యలు చేపట్టినప్పట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన యాత్రీకులకు బృం దావన్ పోలీసు అదికారులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సంరక్షణ కల్పించారు. యాత్రీకుల కోసం అక్కడి టూరిస్ట్ ఫెసిలిటీ సెంటర్లో బస ఏర్పాటు చేశారు. భోజన వసతి కల్పించారు.వారందరిని సురక్షితంగా బైంసాకు తరలించే ఏర్పాట్లపై అక్కడి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులు సైతం యాత్రీకులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించారు. బృందావన్ క్షేత్రానికి చెందిన పలువురు వ్యాపారస్తులు యాత్రీకులకు కప్పుకునేందుకు దుప్పట్లు, ధరించేందుకు దుస్తులతో పాటు ఇతర సామాగ్రిని ఉచితంగా అందజేశారు. యాత్రీకులు ఎలాంటి భయాందోళనల బారిన పడకుండా ఉండేందుకు గాను అక్కడి పోలీసులు, అర్ఎస్ఎస్ శ్రేణులు, వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో సహయ సహకారాలు అందిస్తున్నారు.

– భర్త సజీవ దహనం, భార్య సురక్షితం

యాత్రలకు కుభీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన దంపతులిద్దరు వెళ్లారు. బస్సు వృందావన్ క్షేత్రానికి చేరుకున్న అనంతరం యాత్రీకులంతా దర్శనం కోసం బయలు చేరారు. అయితే పల్సి నుంచి వెళ్లిన దంపతుల్లో భర్త అనారో కారణంతో బస్సులోనే ఉండిపోగా, భార్య ఇతర యాత్రీకులతో కలిసి దర్శనం కోసం వెళ్లింది. ఇదే సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్సులో ఉన్న భర్త సజీవ దహనం అవ్వగా దర్శనం కోసం వెళ్లిన భార్య సురక్షితంగా బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement