Sunday, January 12, 2025

ADB | బర్డ్ వాక్ కు అపూర్వ స్పందన.. తరలివచ్చిన పక్షి ప్రేమికులు !

జన్నారం, (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్‌ అడవుల్లోని బైసనుకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన బర్డ్‌ వాక్‌కు అపూర్వ స్పందన లభించింది.

పలు ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చిన పక్షి ప్రేమికులు… తమ కెమెరాల్లో వివిధ రకాల పక్షులను చిత్రీకరించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మంచిర్యాల కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ శాంతారాం, మంచిర్యాల డిఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, స్థానిక ఇన్చార్జి వి.సుష్మారావు ఆధ్వర్యంలో పలు జిల్లాల నుంచి వచ్చిన పక్షి ప్రేమికులంతా శనివారం రాత్రి సఫారీలో అడవుల్లోకి వెళ్లి అడవుల్లోనే బస చేశారు.

పక్షి ప్రేమికులందరికీ భోజనంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. పక్షి ప్రేమికులు అడవుల్లో కలియ తిరుగుతూ కనబడ్డ పక్షులను తమ కెమెరాలల్లో బంధించారు.

కట్టెలమంటతో ఏర్పాటు చేసుకున్న నెగడి పక్షి ప్రేమికులను ఆకట్టుకుంది.వారి వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, సెక్షన్ ఆఫీసర్లు నహీదా పర్వీన్,శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు లాల్ భాయ్,ఎస్. శ్రీనివాస్,సాయి,తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement