దేశవిదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపడుతూ, నిర్దిష్ట సమయం కంటే ముందే పనులు పూర్తి చేస్తుందన్న రికార్డులు సొంతం చేసుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐ ఎల్) కంపెనీ పేరు పార్లమెంటు సాక్షిగా ప్రశంసలు అందుకుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో రోడ్డు రవాణా-జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ 2022-23 బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో భాగంగా…దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అందులో భాగంగా కాశ్మీర్‌లో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దేశ, విదేశాల్లో పేరెన్నికగన్న అనేక కాంట్రాక్టు సంస్థల నుంచి టెండర్ కోరినట్లు గడ్కరీ చెప్పారు. కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మేఘా సంస్థ మాత్రం అత్యంత తక్కువ ధరకు ఈ పనికి టెండర్ వేసిందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు గడ్కరీ తెలిపారు. అత్యంత క్లిష్టమైన వాతావరణం ఉండే జోజిల్లా పాస్‌లో మేఘా సంస్థ శరవేగంగా పనులు చేపడుతోంది. జంట టన్నెల్స్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రెండు బ్రేక్ త్రూలు సాధించింది. ఎంఈఐఎల్ చేపడుతున్న జోజిల్లా పాస్ పనులు వేగంగానే కాదు, నాణ్యంగా కూడా జరుగుతున్నట్లు ఇప్పటికే పలుసార్లు అధికారులు ప్రశంసించారు.
మేఘా వల్ల దేశానికి రూ. 5వేల కోట్ల ఆదా: కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంశలు
Advertisement
తాజా వార్తలు
Advertisement