Sunday, November 3, 2024

TS: బీఆర్ఎస్ నేత సీతారాంనాయక్ ను క‌లిసిన కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 400 ఎంపీ సీట్లు సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలపై కన్నేసింది. వారిని పార్టీలో చేర్చుకుని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే ఇవాళ హనుమకొండలో మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనను బీజేపీలోకి రావాలని ఆహ్వనించారు. అందుకు సీతారాం నాయక్ తనకు కాస్త సమయం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. కాగా, పార్టీలో తమకు అన్యాయం చేస్తున్నారంటూ సీతారాం నాయక్ బీఆర్ఎస్ అధిష్టానంపై ఇటీవలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాడినని, కేసీఆర్ అడుగులో అడుగు వేసిన వారిలో తాను ఒక్కడినే అని గళమెత్తారు. అలాంటి తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరం పెడుతున్నారని బాహాటంగానే నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement