Tuesday, November 26, 2024

RR: సమస్యలు పరిష్కరించండి.. మంత్రి మల్లారెడ్డికి మున్సిపల్ కార్మికుల వినతి

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్ ఆగస్ట్ 12 : తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇవాళ ఉదయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని తన నివాసంలో కలుసుకున్నారు. మునిసిపల్ కార్మికుల వేతన సవరణ కాల పరిమితి ముగిసినందున వెంటనే 2వ పీఆర్సీనీ విడుదల చేయాలని, అలాగే మునిసిపల్ లో అనేక ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మునిసిపల్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఇందుకు సంభందించి వినతిపత్రం అందజేశారు.

అలాగే మునిసిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు, మే డే సందర్భంగా పెంచిన వెయ్యి రూపాయలను కూడా వెంటనే ఇప్పించాలని వారు మంత్రిని కోరారు. మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో మునిసిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.రవిచందర్, ఏసురత్నంలు, మేడ్చల్ జిల్లా ఎఐటియుసి అధ్యక్షులు కె.స్వామి, ప్రధాన కార్యదర్శి డి.ఎన్.శేఖర్ ఉపాధ్యక్షులు హరినాద రావు, డిప్యూటీ సెక్రెటరీ వి.శ్రీనివాస్ లున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement