Tuesday, November 26, 2024

యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టండి.. పంట నష్టంపై అంచనా వేసి ఆదుకోవాలి: భట్టి

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్థవ్యవస్థమైందని, లక్షలాది ఎకారల్లో పంట నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి క్షేత్ర స్థాయికి పంపించాలన్నారు. గోదావరి నదీపై ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడ వల్ల ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వందలాది గ్రామాల్లో రాకపోకలు బంద్‌ కావడం వల్ల ప్రజలు అత్యవసర సేవలు కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి సహాయం అందించాలన్నారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహారించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందన్నారు. వరదల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయలకు రాలేని ప్రాంతాలను గుర్తించి ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించేలా కార్యాచరణ ఉండాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట పోలాల వద్దకు పంపించి పంట నష్ట పరిహారంపై అంచనా వేయించాలన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని భట్టి పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా పార్టీకి చెందిన క్షేత్ర స్థాయి నాయకులు చూడాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement