దాన్యం కొనుగోలు లో కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా మహా ధర్నా కొనసాగుతోంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు కుటిల రాజకీయాలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. వచ్చే యాసంగి కి సంబందించి రైతులు పండించే వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు.