Tuesday, November 26, 2024

తెలంగాణ సచివాలయం భవనం కింద.. మినీ రిజ‌ర్వాయ‌ర్

తెలంగాణ కొత్త స‌చివాల‌యం నిర్మాణం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. కాగా సెక్రటేరియల్ లో పని చేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంక్ సిద్ధం చేశారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్ లా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉండనుంది. వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయం భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17 న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భారీ భవనం నిర్మితం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement