Wednesday, November 27, 2024

ADB | వేమనపల్లిలో అందని వైద్యం.. వైద్యుని కోసం రోగుల ఎదురుచూపు

వేమనపల్లి, నవంబర్ 27, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రానికి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమనపల్లి మండలంలో వైద్యం అందని ద్రాక్షగా మారింది.

ఎంతో వెనుకబడిన మారుమూల ప్రాంతమైన వేమనపల్లి మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ సరైన సమయానికి వైద్యులు, సిబ్బంది రాక రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ రాకపోవడంతో రోగులు ఆసుపత్రి ముందు ఎండలో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆస్పత్రిలో కేవలం అటెండర్, కొత్తగా వచ్చిన ఏఎన్ఎం తప్ప ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆసుపత్రి ముందే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

మారుమూల ప్రాంతమైన వేమనపల్లి మండలంలోని ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, వైద్య సిబ్బంది సరైన సమయానికి రాక వైద్యమందక రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారి స్పందించి వేమనపల్లి ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చూడాలని, రోగులకు వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement