Wednesday, November 13, 2024

Ujjaini Mahakali – ఈ ఏడాది అంతా శుభమే… మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘భక్తులను సంతోషంగా పిలిపించుకున్నారు. భక్తుల పూజలు చాలా సంతోషం కలిగించాయి’ అని ఆమె భవిష్యవాణి వినిపించారు.

“అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని భవిష్యవాణిని వినిపించారు స్వర్ణలత.. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే వాళ్ళు వీళ్ళే తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చిన సంతోషంగా అందుకునే బాధ్యత నాది కోరినంత వర్షాలు వుంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంట . నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను శాశ్వతంగా పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా . నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి సాక పెడుతున్నారు. ఈ సారి కూడా 5 వారాలు పప్పు బెల్లలతో సాక పెట్టండి.. పాడి పంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. మందులు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి . బలి ఇవ్వడం లేదు మీకు నచ్చింది ఇస్తున్నారు. కానీ దానితోనే సంతోష పడుతున్నాను. సంతోషంగా ఘనంగా పూజలు అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా వుండేలా చూసుకుంటాను.” అంటూ భ‌విష్య‌వాణి వినిపించారు..

.

రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర నేడు ముగియనుంది. పచ్చి కుండపై నిలబడి మాతంగి చెప్పే భవిష్యవాణిపై భక్తుల ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొననున్నారు. ఇప్పటికే ఆలయానికి సీఎస్ శాంత కుమారి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement