Monday, October 21, 2024

U Turn Politics – రేవంత్ తో ఎమ్మెల్యే బండ్ల భేటి… యు ట‌ర్నా…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయ‌న నివాసంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కలుసుకున్నారు.. ఆయ‌న‌తో పాటు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు కూడా ముఖ్య‌మంత్రి భేటి అయ్యారు.. ఇటివ‌ల బండ్ల బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను క‌లిసిన నేప‌థ్యంలో ఆయ‌న బిఆర్ఎస్ లోకి చేర‌నున్న‌ట్లు వార్త‌లు విన‌వ‌చ్చాయి..

అయితే ముఖ్య‌మంత్రితో భేటి అనంత‌రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారని అంటున్నారు… అలాగు బండ్ల అసంతృప్తిని చ‌ల్లార్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి గురువారం నాడు బండ్ల ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన బండ్ల నేడు రేవంత్ ను క‌లిశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement