సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు గరిడేపల్లి మండలం, కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26), శీలం ఉపేందర్ (24) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అలాగే మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ డీసీఎం – కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవాపూర్‌లోని అచ్యుతరావు గూడలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి పూరి గుడిసె దగ్ధమైంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.50 వేల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.