ప్రభ న్యూస్, ఆర్మూర్ :ఆగస్టు 4; కొంతమంది యువకులు కలిసి సరదాగా ఆనందించారు. ఎస్సారెస్పీ గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శించి మెండోరా శివారులోని కాకతీయ కాలువ వద్ద కలిసి భోజనం చేశారు. అంతలోనే ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతూ గల్లంతయ్యారు. మరిన్ని వివరాలలోకి వెళ్తే… నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన పుట్ట వేణు (22) , ప్రాణవ్ రావ్ (19) లు మరొక స్నేహితునితో కలిసి పోచంపాడు సందర్శనకు వెళ్లారు. అనంతరం మెండోరా గ్రామంలోని మరొక స్నేహితుని వద్దకు వెళ్లి కలిసి భోజనం చేసి నట్టు సమాచారం. అనంతరం ప్రమాదవశాత్తు వేణు నీట ములుగుతున్నడని గమనించిన ప్రణవ్ రక్షించే ప్రయత్నంలో కాలువలు దిగాడు. కాకతీయ కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇరువురు కొట్టుకుపోయారు
. దీంతో స్నేహితుల కోసం ఒడ్డున ఉన్న వారు వేసిన కేకలు విన్న కొంతమంది గొర్రెల కాపరులు వారిని రక్షించే ప్రయత్నం కూడా చేసినారు. అయితే వేణు ప్రణవ్ లు నీటమురిగే అదృశ్యం కావడంతో చేసేదేమీ లేక అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నీటి విడుదలను ఆపివేసి గజహితగాలతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం కావడంతో చీకటి పడి వెతికే ప్రయత్నాన్ని ఆపివేశారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా గల్లంతైన యువకుల కోసం విలపించడం స్థానికులను కలిచివేసింది.
తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ యాదవ్ లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.