పంజాగుట్ట రోడ్డు ప్రమాద కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ దగ్గర కారు బీభత్సం కేసులో పోలీసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహేల్ ప్రమేయం ఉన్న ఈ కేసులో..తాజాగా మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సోహెల్ ను తప్పించేందుకు ప్రయత్నించిన బోధన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
ఇవాళ ఉదయం బోధన్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని వారిని హైదరాబాద్ తరలించారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుతో..బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, డిసెంబర్ 23న అర్ధరాత్రి సమయంలో సోహెల్ అతివేగంగా కారు నడిపాడు. ప్రజాభవన్ ముందు ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను కారుతో ఢీ కొట్టాడు. అయితే ఈ ప్రమాదానికి కారణం తన డ్రైవర్ అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సోహెల్ స్థానంలో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ అనంతరం షకీల్ కొడుకు సోహెల్ దుబాయ్ పరారయ్యాడు