హైదరాబాద్ : కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వాన జాడ లేనప్పటికీ రాత్రి 9 గంటల నుంచి నగర వ్యాప్తంగా ముసురు ముసురుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి
కాగా రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 28.0డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6డిగ్రీలు, గాలిలో తేమ 79శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు