తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ఈనెల 29,30తేదీలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది విధుల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ తేది నవంబర్ 30, ముందురోజు నవంబర్ 29న రెండు రోజులు ప్రభుత్వ స్కూళ్లకు సెలవు ప్రకటించనున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు ఈవీఎం యంత్రాలను తీసుకునేందుకు సిద్ధమంటూ 29న ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందు రోజు మధ్యాహ్నానికే పోలింగ్ కేంద్రాలైన పాఠశాలలకు చేరుకుంటారు. ఇక ఎన్నికల విధులు పూర్తయ్యి ఈవీఎంలను సమర్పించే సరికి అర్ధరాత్రి దాటే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలోని మొత్తం 1.06 లక్షల ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.