మర్కూక్: సిద్దిపేట జిల్లాలో ఈత సరద ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసింది. మర్కూక్ వద్ద కాలువలో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు స్పందించి ఆరుగురిని బయటకు తీశారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు.
మర్కూర్ గ్రామానికి చెందిన సంపత్(12), వినయ్(12) మృతి చెందారు. సోమవారం ఉదయం మర్కుక్ గ్రామానికి చెందిన రాజు, సంపత్, వినయ్ కలిసి వాకింగ్ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పంపు హౌస్ దగ్గర పెద్ద కాలువలో స్నానం చేసేందుకు కాలువలో దిగారు. అయితే ప్రమాదవశాత్తు కాలువలో జారిపడటంతో వినయ్ (11), సంపత్ (14) నీటిలో మునిగి చనిపోయారు. రాజుకు ఈత రావడంతో బయటక వచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.