హైదరాబాద్ – దున్నపోతు వీడియోతో ట్విట్ చేసిన బిజెపి సీనియర్ నేత,మాజీ ఎంపి జితేందర్ రెడ్డి నేడు మరో ట్వీట్ చేశారు. అయితే, ఈసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రఘునందన్‌ను జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తా అంటూ అంటూ ట్విట్ తో పాటు రఘునందన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కేంద్రానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రఘునందన్ విమర్శలు చేశారు.
ముఖ్యంగా మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మూడు రోజుల క్రితం జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారాన్ని లేపగా.. తాజాగా రఘునందన్ కు మద్దతు పలుకుతున్నానని జితేందర్ రెడ్డి పేర్కొనడం ఆ పార్టీలో ఏదో జరగుతుందనే ప్రచారం మరింత జోరందుకుంది..