హైదరాబాద్ – నదుల వెంట నాగరికత వర్ధల్లాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నదులను కబళిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్కు మూసీ ఒక వరం కావాలని ఆకాంక్షించారు. ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కర్ణాటకకు చెందిన ఆనంద్ హైదరాబాద్ లోని చెరువులను పరిశీలిస్తున్నారు..
ఈ సందర్భంగా రేవంత్ తన ఎక్స్ ఖాతాలో నేడు చెరువులను ఎట్టిపరిస్థితుల్లో శాపంగా మిగిలిపోనివ్వబోమని ట్విట్ చేశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండూ కీలకమే అని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయాలని ప్రజాప్రభుత్వం ఆల్రేడీ సంకల్పం తీసుకున్నదని ఎవరూ అడ్డువచ్చినా ఇది ఆగదని అన్నారు. ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయమని ఇది అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి.. ప్రతి వ్యవస్థకి ధన్యవాదాలు అని తెలిపారు.