Tuesday, November 26, 2024

Twit – సామాజిక న్యాయం కోసం ఈ య‌జ్ఞం – కుల గ‌ణ‌న ప్రారంభంపై రేవంత్ ట్విట్

అవకాశాల్లో సమానత్వం,
అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం ఈ క్ర‌తువు
తెలంగాణ ప్రారంభ‌మై..దేశ వ్యాప్తంగా రాహుల్ సార‌ధ్యంలో సాగ‌నున్న ప్ర‌క్రియ

హైద‌రాబాద్ – కుల గణన దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ట్విట్ చేశారు.. కుల గ‌ణ‌న‌పై ఆయ‌న‌ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన‌ట్లు పేర్కొన్న రేవంత్ అంద‌రూ కుల గ‌ణ‌న స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement