Tuesday, November 26, 2024

Twit – చివరి సంస్కారాలపై కూడా అంక్షలా… రేవంత్ పై కెటిఆర్ రుసరుస

ఇదేనా మీ ప్రజాపాలనా
శైలజను చివరి చూపులు చూడకుండా పోలీసుల దిగ్బంధం
సర్పంచ్ అంతిమయాత్ర దారిలో బారికేడ్లు
రేవంత్ ది నియంత పాలనంటూ కెటిఆర్ ఫైర్

హైదరాబాద్ – కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలుషిత ఆహారం తిని తొమ్మిదో తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాలిక మరణిస్తే పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియా, ప్రజాప్రతినిధులకు వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోకి నో ఎంట్రీ అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు భారీగా మోహరించడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతిమ సంస్కారానికీ ఆంక్షలా…

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిప‌ల్లికి చెందిన మాజీ స‌ర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకోగా, ఆయ‌న అంతిమయాత్ర సోమ‌వారం జ‌రిగింది. భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఈ అంతిమ‌యాత్రం సాగింది. అంతిమయాత్ర‌పై కూడా ఆంక్ష‌లు విధించారంటూ రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా నిప్పులు చెరిగారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలనా అంటే? అని నిల‌దీశారు. ఒక మాజీ సర్పంచ్, 85 ఏళ్ల‌ పెద్ద మనిషి ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వ లేకుండా చేశారు. ఎంతో క్షోభ పెట్టి, ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టారు. ఆఖరికి అంతిమ యాత్రకు కూడా ఆంక్షలు పెట్టడం ఏంటి? అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement