హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు.. గత దశాబ్ద కాలంగా ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన వీడియోను తన ట్వీట్‌కు జోడించారు కేటీఆర్.
ఇలా తెలంగాణ ప్రగతిని ప్రస్తావించిన చంద్రబాబుకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో ఈ ప్రగతిపై మీ పూర్వ శిష్యుడు రేవంత్ రెడ్డికి కాస్త అవగాహన కలిగించండి అంటూ కెటిఆర్ ఎపి సిఎం ను కోరారు.. “థ్యాంక్యూ చంద్రబాబు గారూ.. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవగాహన కల్పించండి” అని ట్వీట్లో రాసుకొచ్చారు.