Saturday, January 11, 2025

Twit – సుంకిశాల నివేదికను దాస్తోన్న రేవంత్ .. కేటీఆర్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – సుంకిశాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణం అని ఫైర్ అయ్యారు బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరం అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..

- Advertisement -

మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్‌ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సిఎం రేవంత్ – మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే..అని ఆరోపణలు చేసారు.సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్‌ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింద‌న్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింద‌ని పేర్కొన్నారు.

నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే.. అని చురకలు అంటిoచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించార‌న్నారు. మేఘాను తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నార‌ని ఆరోపించారు కెటిఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement