Saturday, January 4, 2025

Twit – గురుకులాల‌పై ఎందుకీ క‌క్ష‌ … విద్యార్ధుల‌కు ఎందుకీ శిక్ష‌.. కెటిఆర్

కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై కెటిఆర్ ఆగ్ర‌హం
ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌ల వ‌ర్షం

హైద‌రాబాద్ – పదేండ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం ఏడాదిలో ఎందుకు పడిపోయిందని కాంగ్రెస్ స‌ర్కార్ ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నించారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని మండిపడ్డారు. ఇది కక్ష్యా, శిక్ష్యా లేక నిర్లక్ష్యమా అని ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కార్‌ను నిలదీశారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా అన్నారు. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుంచి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా అంటూ విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం, నేడు అంతులేని నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరని ప్రశ్నించారు కెటిఆర్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement