Friday, September 20, 2024

Twit – రైతులను అరెస్టు చేయడం దారుణం: కేటీఆర్

రుణ‌మాఫి కోసం ఆందోళ‌న చేయ‌డం నేరమా..
అన్న‌దాత‌ల అక్ర‌మ నిర్భందాలు ఆపండి
అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయండి
రేవంత్ కు కెటిఆర్ విన‌తి …

హైదరాబాద్‌: రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన వారి అరెస్టును ఖండిస్తున్నామన్నారు.

- Advertisement -

బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అన్నారు. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. గురువారం ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతున్నదని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు.


అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందునే ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement