హైదరాబాద్ – సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు అంటూ రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు.. మాజీ మంత్రులు హరీశ్ రావు,జగదీశ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను నేటి ఉదయం అరెస్ట్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు… పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు… పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు అంటూ ఆగ్రహించారు కేటీఆర్. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు… ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు అంటూ ఆగ్రహించారు.
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు… ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు… ప్రజలపై కేసులు… ప్రజాప్రతినిధులపై కేసులు… కేసులు .. కేసులు .. కేసులు… కాసులు మీకు – కేసులు మాకు అంటూ ఫైర్ అయ్యారు. సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు అన్నారు. మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి లతో పాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. జాగో తెలంగాణ జాగో అంటూ నినాదించారు కేటీఆర్.
కేరళ వెళ్లిన కెటిఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అవుతున్న తరుణంలోనే నేటి ఉదయం కెటిఆర్ కొచ్చికి వెళ్లారు. కేరళలోని కొచ్చిలో జరుగుతున్న టైకాన్ కేరళ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు విమానంలో అక్కడికి చేరుకున్నారు.. . దీంతో బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి వెళ్లలేకపోయారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై స్పందించిన కెటిఆర్ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.