హైదరాబాద్ : గురుకుల పాఠశాల హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అక్కడ పెడుతున్న అన్నం తినలేక విద్యార్థులు ఇళ్లకు పరుగులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు ఆగ్రహించారు.
కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలని తల్లిదండ్రులు భావిస్తున్నారని మాజీ మంత్రి చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని, అందులో పెడుతున్న అన్నం తినలేక విద్యార్థులు ఇళ్లకు పరుగులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.