Monday, December 2, 2024

Twit గృహ‌జ్యోతితో పేద‌ల‌ ఇళ్ల‌లో వెలుగులు – రేవంత్

ఒక్క హైద‌రాబాద్ లోనే 10.52 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి
స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ ప్ర‌జాప్ర‌భుత్వం సంక‌ల్పం
సంక్షేమానికి కేరాఫ్ అడ్ర‌స్ గా ఇందిర‌మ్మ పాల‌న‌
ఈ మేర‌కు ఎక్స్ లో ట్విట్ చేసిన రేవంత్

హైదరాబాద్ – పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ ప్ర‌వేశ‌పెట్టిన గృహ‌జ్యోతి ప‌థ‌కం సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం వివరించారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

కాగా, పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్నది. . ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement