Saturday, January 4, 2025

Twit – అన్న‌పూర్ణ తెలంగాణ‌లో ప‌ట్టెడ‌న్నం కోసం ఆర్త‌నాదాలా … కెటిఆర్

బువ్వ‌కోసం బిడ్డ‌లా ఏడ్పులా..
సిగ్గు.. సిగ్గు .. ఇది పాల‌కుల పాప‌మే
రేవంత్ స‌ర్కార్ తీరుపై కెటిఆర్ గ‌రం గ‌రం

హైద‌రాబాద్ – కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణ రాష్ట్రంలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్నపూర్ణ నా తెలంగాణలో.. బువ్వకోసం బిడ్డల ఏడ్పులా? అంటూ ప్రశ్నించారు. పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలోని ఓ గురుకుల విద్యార్థినులు తమకు సరిగా అన్నం కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

‘అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా?. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా?. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలి కేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా?. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు.. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా?. సిగ్గు సిగ్గు, ఇది పాలకుల పాపం.. విద్యార్థులకు శాపం, జాగో తెలంగాణ జాగో’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement