Tuesday, November 26, 2024

మున్నూరు రవి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. తామే తీసుకెళ్లామని తెలంగాణా పోలీసుల వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో కలకలం రేపిన తెలంగాణాకు చెందిన మున్నూరు రవి కిడ్నాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రవితో పాటు మరో ముగ్గురిని తెలంగాణ పోలీసులే తీసుకెళ్లినట్టు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సౌత్ అవెన్యూలోని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మున్నూరు రవి, అతనితో వచ్చిన ఇద్దరితో పాటు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను తమ వెంట తీసుకెళ్లారు. జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఐపీసీ 365 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పీఎస్‌లో మున్నూరు రవి సహా పలువురిపై కేసు నమోదైనట్టు తేలింది. ఆ కేసులో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. అయితే జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను మాత్రం పొరపాటున అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బుధవారం రాత్రికి థాపాను విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మున్నూరు రవితో పాటు ముగ్గురి అరెస్టు అంశంపై ఢిల్లీ పోలీసులకు తెలంగాణా పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంపై ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement