ప్రభ న్యూస్ తూప్రాన్ – ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లోని తూప్రాన్ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ముఖ్య మంత్రి కేసీఆర్ మళ్లీ గజ్వేల్ నుంచే పోటీ చేయాలని కామారెడ్డి నుండి విరమించుకోవాలని కౌన్సిల్ తీర్మానం ఆమోదించింది..
గజ్వేల్ లో సీఎం లేని గజ్వేల్ ను ఊహించుకోలేమని అంటూ వేలకోట్ల రూపాయల అభివృద్ధి చేసిన సీఎం కే చంద్రశేఖర రావు మూడవసారి కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని తూప్రాన్ మున్సిపల్ లోని 13 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా గజ్వేల్ నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని మంత్రి హరీష్ రావు గారి చొరవతో తూప్రాన్ కూడా కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.. మెదక్ బహిరంగ సభలో తూప్రాన్ మున్సిపాలిటీ 25 కోట్లు మంజూరు చేయడం పట్ల మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ,, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ పాలకమండలి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, ఉమా సత్తి లింగం, చెలిమిల ప్రియాంక దుర్గారెడ్డి , రాజు, తలారి మల్లేష్, రాముని గారి శ్రీశైలం గౌడ్ కుడిపేక నారాయణ గుప్తా కమిషనర్ మోహన్ పాల్గొన్నారు