Sunday, November 24, 2024

Tubgathurthi – 8 కేజీల తరుగు ఇవ్వాలన్న మిల్లర్ – పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్య యత్నం

క్వింటాకు ఎనిమిది కేజీల తరుగు ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తానని మిల్లర్ చెప్పడం తో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసారు. వివరాలలోకి వెళితే సూర్యాపేట – తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి నాణ్యత లేదని.. క్వింటాకు ఎనిమిది కేజీల తరుగుకు ఒప్పకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లు యాజమాని చెప్పాడు.

ఒక కేజీ తరుగుకు ఒప్పుకుంటానని రైతు చెప్పడంతో.. రైస్ మిల్లు యజమాని ధాన్యాన్ని తిప్పిపంపాడు. దీంతో తీవ్ర మనస్తా పానికి గురైన రైతు గుగులోతు కీమా దంపతులు తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవారు అడ్డుకుని వారిని కాపాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement