Thursday, November 21, 2024

TSRTC: ర‌క్త‌దాత‌ల‌కు రేపు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం

ఇండియన్ ట్రస్టు సహకారంతో టీఎస్ ఆర్టీసీ రేపు రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్ డిపోల్లో ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హిస్తోంది. రేపు ఉద‌యం ఉదయం 9 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తోంది. అన్ని రీజియన్ల నుంచి 65 చోట్ల ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే అన్ని tsrtc మెగా రక్తదాన శిబిరాల్లో రేపు రక్తదానం చేసే రక్తదాతలందరికీ రేపు మాత్రమే tsrtc ఉచిత రవాణాను అందిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైన ఉద్యోగులందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మహిళల కోసం రక్త సేకరణ కార్యక్రమాన్ని అన్ని డిపోలు, వర్క్ షాప్, బస్ భవన్ లతో పాటు బస్ స్టేషన్లలో కూడా నిర్వహిస్తున్నామ‌న్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని డిపో మేనేజర్‌లను సంప్రదించాల‌ని ఆయ‌న కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement